: మా పార్టీ నుంచి ఫిరాయించిన వారు మాట్లాడితేనే మేం అడ్డుకుంటున్నాం!: వైకాపా వివరణ


ఈ ఉదయం ఏపీ అసెంబ్లీలో కొంతమంది మాట్లాడుతున్న వేళ, వైకాపా సభ్యులు వారి వద్దకు వెళ్లి అడ్డంగా నిలబడి ప్లకార్డులు ప్రదర్శించడాన్ని పలువురు తప్పుబట్టగా, వైకాపా వివరణ ఇచ్చింది. తాము అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు మాట్లాడుతుండగా, అడ్డుకోలేదని, వైకాపా టికెట్ పై గెలిచి, ఆపై పార్టీ ఫిరాయించి రాజీనామా చేయకుండా, అసెంబ్లీలో మాట్లాడాలని యత్నిస్తున్న వారినే అడ్డుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్, వారికి మైకులను ఇచ్చి ప్రోత్సహించడాన్ని తాము నిరసిస్తున్నామని అన్నారు. కాగా, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు మైకు ఇచ్చిన సమయంలో, పలువురు వైకాపా సభ్యులు ఆయన వెనక నిలబడి నినాదాలు చేశారు. తమ వద్దకు వచ్చి నినాదాలు ఏంటని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వైకాపా వైఖరిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News