: నన్ను లారీతో తొక్కి చంపించేస్తారట: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన ఆరోపణలు
విశాఖలో చట్ట వ్యతిరేకంగా అన్యాక్రాంతమైన భూముల గురించి తాను మాట్లాడుతూ ఉంటే, తనను లారీలతో తొక్కించి చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. అధికారికంగా ల్యాండ్ పూలింగ్ ప్రకటించక ముందే కొందరు అనధికారికంగా పూలింగ్ చేశారని, రూ. 2 వేల కోట్ల విలువైన భూములను లాగేసుకున్నారని ఆయన ఆరోపించారు.
దీనిపై సభాసంఘాన్ని వేయమంటే, తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. విశాఖ పరిధిలోని అసైన్డ్ భూములన్నీ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని, ఈ విషయాన్ని బయటపెట్టిన తనను హత్య చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఇంత పెద్ద దందా జరుగుతూ ఉంటే సీఎం ఎందుకు స్పందించడం లేదని, విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని విష్ణుకునార్ రాజు ప్రశ్నించారు.