: ఆ విషయం పుజారా భార్యనే అడగండి: రవిశాస్త్రి ప్రశ్నకు కేఎల్ రాహుల్ సమాధానం
ఆస్ట్రేలియాతో సిరీస్ విజయం తరువాత, మాజీ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి, రెండో ఇన్నింగ్స్ వీరులు కేఎల్ రాహుల్, పుజారాలతో మాట్లాడుతున్న వేళ, నవ్వులు విరిశాయి. ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్లలో ఆడుతూ బిజీగా ఉన్న పుజారాను, కొంత విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నావా? అని రవిశాస్త్రి ప్రశ్నించగా, సమాధానాన్ని పక్కనే ఉన్న కేఎల్ రాహుల్ చెప్పాడు. ఈ విషయం పుజారా భార్య పూజాను అడగాలని సూచించాడు. పుజారాకు కొంత విశ్రాంతిని ఇస్తుందో లేదో ఆమెను అడగాలని, ఆమే సరైన సమాధానం చెప్పగలదని అనడంతో, ఈ సంభాషణను విజిటర్స్ బాక్స్ నుంచి వింటున్న పూజ సైతం నవ్వాపుకోలేకపోయింది. ఇక రవిశాస్త్రి సైతం నవ్వుతూ ఈ విషయాన్ని పూజా పుజారాను అడుగుతానని చెబుతూ, మంచి సిరీస్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఇద్దరినీ అభినందించారు.