: ధర్మశాల టెస్టులో ఆసక్తికర విశేషాలివి!


ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇండియా నిలబెట్టుకుంది. నేడు ముగిసిన నాలుగో టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని సాధించి, టెస్టుల్లో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఈ మ్యాచ్ లో పలు ఆసక్తికర విశేషాలున్నాయి.
* పుజారా ఇంతవరకూ స్వదేశంలో 50 ఇన్నింగ్స్ లు ఆడగా, నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో తొలిసారిగా డక్కౌట్ అయ్యాడు. విదేశాల్లో 31 ఇన్నింగ్స్ లు ఆడిన పుజారా ఖాతాలో మరో రెండు డక్కౌట్లు ఉన్నాయి.
* ఒకే ఇన్నింగ్స్ లో ముగ్గురు భారత బౌలర్లు మూడు కన్నా ఎక్కువ వికెట్లను తీయడం 2000 తరువాత ఇదే తొలిసారి. న్యూజిలాండ్ లో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ తరువాత, ముగ్గురు బౌలర్లు సత్తా చాటడం ధర్మశాలలోనే జరిగింది.
* బౌలర్ ఉమేష్ యాదవ్ అత్యుత్తమ గణాంకాలు ఈ సిరీస్ లో నమోదయ్యాయి. మొత్తం 15 వికెట్లను అతను తీయడం గమనార్హం.
* ఆసీస్ స్టార్ బ్యాట్స్ మెన్ వార్నర్ యావరేజ్ కేవలం 24.12 మాత్రమే. ఇది అతని క్రికెట్ చరిత్రలో అతి తక్కువ యావరేజ్ స్కోర్లలో మూడవది.
* 2016-17 సీజన్ లో కోహ్లీ, విజయ్, జడేజాలు ఆరు సార్లు, రాహుల్ 7 సార్లు 50కి పైగా పరుగులు సాధించారు. పుజారా మాత్రం 12 హాఫ్ సెంచరీలు చేయడం గమనార్హం.
* 500 పరుగులు చేయడంతో పాటు ఓ సీజన్ లో 50 వికెట్లు సాధించిన ఘనత ఈ సిరీస్ తో జడేజాకు దక్కింది. 1979-80లో కపిల్ దేవ్, 2008-09లో మిచెల్ జాన్సన్ సాధించిన ఈ ఫీట్ ను ఇప్పుడు జడేజా కూడా సాధించాడు.

  • Loading...

More Telugu News