: బాలకృష్ణ పంక్చువాలిటీ చూస్తుంటే మతిపోతోంది: పూరీ జగన్నాథ్


నందమూరి బాలకృష్ణతో పని చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నాడు. వాస్తవానికి ఐదేళ్ల క్రితమే బాలయ్యతో పని చేయాలనుకున్నానని... కానీ, ఇప్పటికి కుదిరిందని చెప్పాడు. తమ యూనిట్ సభ్యులందరికీ ఆయనతో కలసి చేయడం ఇదే మొదటిసారని తెలిపారు. ఆయన పంక్చువాలిటీ చూస్తుంటే మతిపోతోందని... ఉదయం ఏడు గంటలకు ఫస్ట్ షాట్ అంటే, ఆరున్నరకే ఆయన సెట్ లో ఉంటారని కితాబిచ్చాడు. కచ్చితంగా ఏడు గంటలకు షాట్ తీస్తున్నామని చెప్పాడు. ఇటీవల ఏడు రోజుల పాటు షూటింగ్ చేశామని... తనకైతే కేవలం రెండు రోజులు మాత్రమే షూటింగ్ చేసినట్టుందని తెలిపాడు. షూటింగ్ మొత్తం చాలా సరదాగా, ఓ పిక్నిక్ లా ఉందని చెప్పాడు. తాను సినిమాను తీస్తున్న విధానాన్ని బాలయ్య బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపాడు. 

  • Loading...

More Telugu News