: భావోద్వేగాలు బద్దలై.. కన్నీరు ఎందుకు తన్నుకొచ్చిందంటే..!: రాజమౌళి
బాహుబలి రెండో భాగం షూటింగ్ ముగించిన చివరి రోజున కూడా భావోద్వేగానికి గురి కాని తాను, ప్రీ రిలీజ్ వేదికపై కన్నీరు ఎందుకు పెట్టుకోవలసి వచ్చిందో రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. షూటింగ్ ముగిసిన రోజున జరిగిన విషయాలను రానా ప్రస్తావించినప్పుడు, తనలో భావోద్వేగాల ఆనకట్ట ఫ్లడ్ గేట్లు ఎత్తివేసినట్లుగా అయిందని చెప్పుకొచ్చాడు. తాను రానాను ఎంతో మిస్ అవుతున్నానని తెలిపాడు. ఈ సినిమాలో భల్లాలదేవుడిగా చేసినందుకు లక్షల కృతజ్ఞతలని అన్నాడు. చిన్నప్పుడు తన చేతులతో ఎత్తుకుని పెంచిన కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవుడిపైనా రాజమౌళి పొగడ్తలు గుప్పించారు. తన తండ్రి కంటే గొప్పగా తను 'దండాలయ్యా' పాటను పాడాడని చెబుతూ, ఆ లింకును ట్వీట్ చేశాడు.
the pride is unexplainable....https://t.co/M2dlqZjvHO
— rajamouli ss (@ssrajamouli) 27 March 2017