: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు!


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. నిన్నటితో పోలిస్తే రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగింది. ఈ రోజు ఏపీలోని అనంతపురంలో అత్యధికంగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 40, తిరుపతిలో 37.5, నందిగామలో 38.1, జంగమహేశ్వరపురంలో 37, విజయవాడలో 36.7, నెల్లూరులో 36.5, చిత్తూరు జిల్లాలోని ఆరోగ్యవరంలో 36.5, కావలిలో 35.6, కాకినాడ 34.7, తుని 34.5, బాపట్లలో 33.1, ఒంగోలులో 34.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక, తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ లో 41.6, నిజామాబాద్ లో 40.9, మహబూబ్ నగర్ లో 40.5, మెదక్ లో 40, హైదరాబాద్ లో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

  • Loading...

More Telugu News