: అమెరికా 'రియల్ హీరో'కు లక్ష డాలర్ల చెక్కును బహూకరించిన ఎన్నారైలు!


అమెరికా రియల్ హీరో ఇయాన్ గ్రిల్లోట్ ను హూస్టన్ లో ఎన్ఆర్ఐలు సత్కరించారు. గత నెలలో కేన్సస్ లో జరిగిన జాత్యహంకార దాడిలో ప్రాణాలకు తెగించి శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాదసానిపై ఆడమ్ పూరింటన్ కాల్పులు జరిపే సమయంలో అతనిని అడ్డుకునేందుకు ఎదురెళ్లి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి నుంచి కోలుకుంటున్న ఇయాన్ గ్రిల్లోట్‌‌ ను ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ అమెరికా రియల్ హీరో అంటూ సత్కరించింది. ఈ సందర్భంగా ఆయనకు ఇల్లు కొనుక్కునేందుకు లక్ష డాలర్ల బహుమతిని అందజేసింది. అనంతరం గ్రిల్లోట్ మీడియాతో మాట్లాడుతూ, 'నా తోటి వ్యక్తి కోసం నేను ఏం చేయాలో అదే చేసాను. ఆపదలో ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, అతని జాతి ఏమిటనేది అప్రస్తుతం. మనందరం మనుషులం. ఆ సమయంలో నేను ఏది సరైనదో అదే పని చేశాను' అన్నాడు. 

  • Loading...

More Telugu News