: 9 వికెట్లు తీసిన టీమిండియా... రాణించిన జడేజా, ఉమేష్, అశ్విన్
టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణిస్తున్నారు. ఒకరి తరువాత ఒకరుగా నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ఆటగాళ్ల భరతం పడుతున్నారు. దీంతో వరుసగా మెయిడెన్ ఓవర్లు వేస్తూ వికెట్లు తీస్తూ ఆకట్టుకుంటున్నారు. 42, 43, 44 ఓవర్లను వరుసగా మెయిడెన్ చేసిన భారత బౌలర్లు, మళ్లీ 46, 47 ఓవర్లను మెయిడెన్ చేశారు. 48వ ఓవర్ లో ఒక పరుగు ఇచ్చిన రవీంద్ర జడేజా పాట్ కుమ్మిన్స్ (12) ను అవుట్ చేశాడు. అనంతరం వచ్చిన ఒకీఫ్ (0)ను జడేజా పెవిలియన్ కు పంపాడు. ఆ
తరువాత వేడ్ కు జత కలిసిన లియాన్ (0) ఉమేష్ యాదవ్ పెవిలియన్ కు పంపాడు. దీంతో టీమిండియా 9 వికెట్లు తీసింది. ప్రస్తుతం క్రీజులో వేడ్ (19) కు జతగా హేజిల్ వుడ్ ఉన్నాడు. ఆస్ట్రేలియా జట్టు 52 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్ మూడేసి వికెట్లతో రాణించగా, రవిచంద్రన్ అశ్విన్ రెండు, భువనేశ్వర్ ఒక వికెట్ తీసి రాణించాడు.