: చెవిరెడ్డి అరెస్ట్ చాలా దారుణం: జగన్


వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్ దారుణమని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో తమ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. దీనికి సంబంధించి సభాపతికి ఏమైనా చెప్పుకుందామంటే సభలో మాట్లాడటానికి మైక్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన సభాపతి... తాను నోరు తెరవకపోగా, తమ నోరు కట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెవిరెడ్డిని ఇంకా విడుదల చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సెటిల్మెంట్లు చేస్తూ... అధికార యంత్రాంగాన్ని తప్పుదారి పట్టించడం దారుణమని చెప్పారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న చెవిరెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన తమ ఎమ్మెల్యేలపై దాడి చేశారని ఆరోపించారు.

రవాణాశాఖ కమిషనర్ పై జరిగిన దాడి గురించి ప్రశ్నిస్తే... ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తారా? అని జగన్ నిలదీశారు. చట్టం తన పని తాను చేయకుండా ముఖ్యమంత్రి అడ్డుకోవడం భావ్యం కాదని అన్నారు. 

  • Loading...

More Telugu News