: మరోసారి భారత ఆటగాళ్లపై నోరు పారేసుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు!


ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్టు మ్యాచులోనూ ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల ప్ర‌వ‌ర్త‌నా తీరు మార‌లేదు. ఈ రోజు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోన్న‌ కీలక సమయంలో టీమిండియా ఆట‌గాడు రవీంద్ర జడేజాను ఆసీస్‌ కీపర్‌ మాథ్యూవేడ్ ప‌లు మాట‌లు అన్నాడు. ఈ రోజు టీమిండియా 102 ఓవర్లకు 286/6తో ఆడుతున్న స‌మ‌యంలో రవీంద్ర జడేజా 37, సాహా 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 103వ ఓవర్‌లో లియాన్‌ బౌలింగ్ చేస్తున్న సమయంలో కీపర్‌ మాథ్యూవేడ్ జడేజాను రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేశాడు. ఏమైంది..? అలా ఎందుకు ఆడుతున్నావు..? ఇక్కడికెందుకు వస్తున్నావు? అంటూ ప‌లు వ్యాఖ్య‌లు చేయడంతో వెంటనే జ‌డేజా అంపైర్‌ దగ్గరికి వెళ్లి  వేడ్ అటువంటి వ్యాఖ్య‌లు ఆపకపోతే ఇక తాను కూడా మొదలుపెట్టాల్సి వస్తుందని చెప్పాడు. అనంత‌రం కూడా జ‌డేజాపై ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.


  • Loading...

More Telugu News