: మెగా హీరో పక్కన ఛాన్స్ మిస్సయిన శ్రీముఖి.. కారణం ఇదేనట!


తమ అందంతో బుల్లి తెర మీద సందడి చేస్తున్న హాట్ యాంకర్లు అనసూయ, రష్మిలతో పోటీపడి అంతటి పాప్యులారిటీని సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి. వీరు ముగ్గురూ సిల్వర్ స్క్రీన్ మీద కూడా సందడి చేశారు. అయితే అనసూయ, రష్మిలు వెండి తెరపైన అందాలను ఆరబోయగా... శ్రీముఖి మాత్రం ఇప్పటి వరకు పద్దతైన పాత్రల్లోనే కనిపించింది. శ్రీముఖికి ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాలో మెరిసే అవకాశం వచ్చింది.

తను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీముఖిని ఓ ఐటెం సాంగ్ కోసం తీసుకుందామని శ్రీను వైట్ల భావించాడట. అయితే, ఆరడుగులకు పైగా ఎత్తుండే వరుణ్ తేజ్ పక్కన శ్రీముఖి చాలా పొట్టిగా కనిసిస్తుందని భావించిన ఆయన... చివరకు ఆమెను తప్పించాడు. శ్రీముఖి స్థానంలో 'బాహుబలి' సినిమాలోని 'మనోహరా...' పాటలో నర్తించిన మధు స్నేహను తీసుకున్నారు. 

  • Loading...

More Telugu News