: ఆమ్ ఆద్మీకి హ్యాండిచ్చి బీజేపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే వేద్ ప్రకాష్
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున బావనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వేద్ ప్రకాష్ సతీష్, తన పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి ఫిరాయించారు. 2015 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనందునే తాను రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్టు ఈ సందర్భంగా వేద్ ప్రకాష్ తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ కు తన రాజీనామా లేఖ పంపినట్టు తెలిపారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చకున్నారు. వచ్చే నెలలో ఢిల్లీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాజకీయ ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆప్ ప్రతినిధి ఒకరు ఆరోపించారు. అందులో భాగంగా తమ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తోందని విమర్శించారు.