: సినీప‌రిశ్ర‌మ ఎవ‌రి సొత్తూ కాదు!: బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్‌


స్టార్‌కిడ్ అయినంత మాత్రాన టాలెంట్‌ లేకపోయినా వారితో సినిమా తీయాలని, డ‌బ్బులు పోగొట్టుకోవాల‌ని ఎవరూ అనుకోరని బాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్‌ధావన్ అన్నాడు. బాలీవుడ్‌లో స్టార్‌కిడ్స్‌కే మంచి అవకాశాలు దక్కుతున్నాయని ఎప్పట్నుంచో ప‌లువురు విమర్శిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే వ‌రుణ్‌ధావ‌న్ మాట్లాడుతూ.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారికి ఇండ‌స్ట్రీలో అవకాశాలు ఈజీగా వస్తాయన్న విష‌యాన్ని తాను ఒప్పుకుంటాన‌ని, అయితే, ప్ర‌తిభ‌, కష్టపడేతత్వం ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలరని ఆయ‌న అన్నాడు. సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చినవాళ్లు ఎంతో మంది సూపర్‌స్టార్‌లు అయ్యారని, అదే ఇప్పటికీ కొనసాగుతోందని, సినీప‌రిశ్ర‌మ ఎవ‌రి సొత్తూ కాదని త‌న‌ అభిప్రాయమ‌ని అన్నాడు.

  • Loading...

More Telugu News