: తప్పు ఎవరు చేసినా శిక్షించాల్సిందే: బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు
రవాణాశాఖ అధికారిపై టీడీపీ నేతల దాడిని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఖండించారు. తప్పు ఎవరు చేసినా శిక్షించాల్సిందేనని... అధికారపక్ష నేతలు తప్పు చేసినట్టు తేలితే శిక్షించాలని అన్నారు. అధికారులపై అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడితే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పారు. అధికారులతో ప్రజాప్రతినిధులు మర్యాదగా మెలగాలని సూచించారు. ఎవరికి అన్యాయం జరిగినా తాము వారి పక్షాన నిలబడతామని చెప్పారు. అయితే, క్షమాపణ చెప్పడంతో కొంతలోకొంత ఊరట లభించినట్టైందని అన్నారు.