: హరిజనుడు, ధోబీ అని సంబోధించినా జైలుకే.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
ఇక నుంచి ఎవరినైనా హరిజనుడు, ధోబీ అని పిలిచినా అవమానించినట్టేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ పదాల్ని కులానికి సంబంధించి కాకుండా ఉద్దేశపూర్వకంగా అవమానించేందుకే వాటిని ఉపయోగిస్తున్నారని పేర్కొంది. అట్రాసిటీ కేసు కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిలును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దోభీ, హరిజనుడు అని పిలవడమంటే వారిని ఉద్దేశపూర్వకంగా అవమానించడంతోపాటు దుర్భాషలాడడం కిందకు వస్తుందని ధర్మాసనం పేర్కొంది. బిహార్‌లోని బెగుసరాయ్‌లో దళిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులను కొందరు అగ్ర వర్ణాల వారు హరిజనులు, ధోబీ అని పిలిచి అవమానించారు. ఈ కేసులో నిందితులకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ పై విధంగా పేర్కొంది.