: బిల్లుకు మద్దతుగా అమెరికాలో భారీ ర్యాలీలు
వలసవాద సంస్కరణల బిల్లుకు సెనేట్ త్వరగా ఆమోదం తెలపాలని కోరుతూ అమెరికా వ్యాప్తంగా లక్షలాది మంది ప్రదర్శనలు నిర్వహించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో దశాబ్దానికి పైగా అక్రమంగా నివాసం ఉంటున్న 1.10కోట్ల మందికి చట్టబద్దంగా పౌరసత్వం లభిస్తుంది. ఇలా అక్రమంగా నివసిస్తున్న వారిలో 2.60లక్షల మంది భారతీయులు కూడా ఉన్నారు. అలబామా, డెన్వర్, లాస్ ఏంజెలెస్, చికాగో, టుస్కన్ తదితర పట్టణాలలో వేలాది మంది ప్ల కార్డులు, అమెరికా పతాకాలను చేబూని ర్యాలీలు నిర్వహించారు.