: గోవును వధించినా లేక, హింసించినా మక్కెలిరగ్గొడతా!: యూపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్


ఉత్తరప్రదేశ్ లో తమ ప్రభుత్వం రావడంతో అక్కడి బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒక యూపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పెనుకలకలం రేపుతున్నాయి. యూపీలోని కటౌలీ నియోజకవర్గ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ మంత్రి సురేష్ రానాకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సాక్షిగా విక్రమ్ సైనీ పలు వ్యాఖ్యలు చేశారు. మంత్రిపై పొగడ్తలు కురిపించే క్రమంలో ఆయన మాట్లాడుతూ, వందేమాతరం, భారత్ మాతాకీ జై అనేందుకు సందేహించేవారిని, లేక గోవును వధించేవారు, లేదా గోవును హింసించే వారిని మక్కెలిరగ్గొడతానని ప్రమాణం చేస్తున్నానని అన్నారు. కాగా, గతంలో ముజఫర్ పూర్ అల్లర్లలో నిందితుడిగా విక్రమ్ సైనీ ఉన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి.  

  • Loading...

More Telugu News