: లైంగిక వేధింపుల ఆడియో బయటకు రావడంతో కేరళ రవాణా శాఖ మంత్రి రాజీనామా


కేరళ రవాణా శాఖ మంత్రి శశీంద్రన్ నైతిక విలువలకు కట్టుబడి తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. కేరళ రవాణాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన శశీంద్రన్ తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కు సమర్పించారు. కేరళలోని ఒక లోకల్ ఛానెల్‌ లో ఆయన లైంగిక వేధింపులు జరిపినట్టు ఆడియోను బ్రాడ్‌ కాస్ట్ చేశారు. దీంతో వివాదం రాజుకుంది. వెంటనే స్పందించిన శశీంద్రన్ నైతిక విలువలకు కట్టుబడి తన పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. కాగా, ఈ ఆరోపణలపై విచారణ జరిపిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 

  • Loading...

More Telugu News