: గ్యాంగ్ రేప్ టీచర్ల కేసులో దారుణమైన విషయాలు వెలుగులోకి!


రాజస్థాన్ లోని బికనీర్ లో 13 ఏళ్ల బాలికపై 18 నెలలపాటు 8 మంది ప్రైవేటు స్కూల్ టీచర్లు జరిపిన గ్యాంగ్ రేప్ లో అత్యంత దారుణమైన వాస్తవాలు వెలుగు చూశాయి. బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్న యువతి సున్నిత భాగాలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఆమె గర్భం దాల్చకుండా ఉండేందుకు బలవంతంగా ఆమెకు గర్భనిరోధక పిల్స్ వేసేవారని వారు తెలిపారు. బ్లడ్ కేన్సర్ రోగులు చికిత్స తీసుకుంటున్న సమయంలో ఇతర మందులు వాడితే తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. దీనిపై రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసును ముఖ్యమంత్రి వసుందర రాజే స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆయన చెప్పారు. నిందితుల్ని వదిలే ప్రశ్నేలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News