: సినిమా ద్వారా ఖాదీ వస్త్రాలకు ప్రచారం కల్పించడం శుభపరిణామం: పవన్ కల్యాణ్ కు కేటీఆర్ కితాబు


'కాటమరాయుడు'తో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సెల్ఫీని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా తానీరోజు 'కాటమరాయుడు' సినిమా చూశానని తెలిపారు. ఈ సందర్భంగా 'కాటమరాయుడు'లో పవన్ కల్యాణ్ నటన బాగుందని కితాబునిచ్చారు. ఒక సినిమా ద్వారా ఖాదీ వస్త్రాలకు ప్రచారం కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. కాగా, ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. కాగా, ‘కాటమరాయుడు’ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రుతి హాసన్‌ కథానాయికగా నటించగా, ఈ సినిమాకు డాలీ (కిశోర్ కుమార్ పార్థసాని) దర్శకత్వం వహించాడు. 

  • Loading...

More Telugu News