: పరుగులు సాధించడం కష్టంగా ఉన్న పిచ్... భారత తొలి వికెట్ డౌన్


ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజున భారత్ తొలి వికెట్ ను కోల్పోయింది. ఆస్ట్రేలియాను 300 పరుగులకు ఆలౌట్ చేసిన జట్టు, ఈ ఉదయం బ్యాటింగ్ ను ప్రారంభించగా, ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్ ల జోడి ఆచితూచి ఆడింది. పరుగులు రాబట్టడం క్లిష్టతరంగా ఉన్న పిచ్ పై 10 ఓవర్లు ముగిసేసరికి పాతిక పరుగులు కూడా రాలేదు. ఈ క్రమంలో 11వ ఓవరర వేసిన హాజెల్ వుడ్, మురళీ విజయ్ ని పెవీలియన్ కు పంపించాడు. 36 బంతులను ఎదుర్కొన్న మురళీ, 11 పరుగులకే వెనుదిరగడంతో, భారత్ తన తొలి వికెట్ ను కోల్పోయింది. ప్రస్తుతం రాహుల్ కు జతగా పుజారా వచ్చి చేరాడు. భారత స్కోరు 12 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 29 పరుగులు.

  • Loading...

More Telugu News