: ఎనిమిదేళ్ల నాడు పాక్ లో శ్రీలంక క్రికెట్ జట్టుపై ఉగ్రదాడి చేసిన యాసిన్ హతం
2009లో పాకిస్థాన్ లో పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడికి పాల్పడిన టీమ్ లో కీలక సభ్యుడైన ఖారీ యాసిన్ హతమయ్యాడు. ఆఫ్గనిస్థాన్ లో అమెరికా సైన్యం యుద్ధ విమానాలను వాడుతూ, అల్ ఖైదా స్థావరాలపై జరిపిన దాడిలో యాసిన్ మరణించాడు. ఈ విషయాన్ని వెల్లడించిన అధికారులు, యూఎస్ సైనిక దాడిలో మరికొందరు అల్ ఖైదా సభ్యులు కూడా మరణించినట్టు స్పష్టం చేశారు. ఖారీ యాసిన్ మరణం ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు ఎదురుదెబ్బని వెల్లడించారు.