: ముంబయ్ మోడల్ ను వేధించిన టీవీ నటుడిపై కేసు
ఓ యువ మోడల్ ను వేధింపులకు గురి చేశాడంటూ, టీవీ నటుడు, 'కైసే హై యే యారియాన్' ఫేమ్ పార్థ సంతాన్ పై కేసు నమోదైంది. పార్థ తనను లైంగికంగా వేధించాడని 20 సంవత్సరాల మోడల్ ముంబై పరిధిలోని బంగర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐపీసీ 354ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి పార్థకు సమన్లు పంపగా, ఆయనింకా విచారణకు హాజరు కాలేదని సమాచారం. గత నెలలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, పార్థ వేధింపులకు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. కాగా, గతంలోనూ పార్థపై ఇదే విధమైన ఆరోపణలు వచ్చాయి.