: ఆధార్ తో పాన్ కార్డు లింక్ తప్పనిసరి... ఎలా చేయాలో తెలుసుకోండి!


ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలును సులభం చేయడం, మరింత మందిని పన్ను పరిధిలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్) కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇన్ కం టాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా పాన్, ఆధార్ లను అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ-ఫైలింగ్ పోర్టల్ ను తెరిచి, వ్యక్తిగత వివరాలను ఇస్తూ, తొలుత రిజిస్టర్ చేసుకోవాలి. ఆపై యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను వాడి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తరువాత ప్రొఫైల్ సెట్టింగ్ బటన్ నొక్కి 'లింక్ ఆధార్' ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆపై కోరిన వివరాలన్నీ, అంటే... పేరు, పుట్టిన తేదీ తదితరాలను ఎంటర్ చేసి, ఆధార్ సంఖ్యను అక్కడ ఇవ్వాలి. వివరాలన్నీ సరిచూసుకున్న తరువాత 'లింక్ నౌ' బటన్ నొక్కితే, పాన్, ఆధార్ లు అనుసంధానమైనట్టు మెసేజ్ వస్తుంది.

  • Loading...

More Telugu News