: రైలెక్కి మధ్యలోనే మాయమైన శివసేన ఎంపీ గైక్వాడ్!
భారత్ లోని విమానయాన సంస్థలన్నీ నిషేధం విధించిన నేపథ్యంలో, తప్పనిసరి పరిస్థితుల్లో న్యూఢిల్లీలో రైలెక్కిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్, గమ్యాన్ని చేరలేదు. ఆయన ముంబై సెంట్రల్ రైల్వే స్టేషనులో దిగాల్సి వుందని, కానీ ఆయన రైల్లో రాలేదని గైక్వాడ్ కోసం ఎదురు చూసిన అధికారులు తెలిపారు. గుజరాత్ లోని వాపీ స్టేషనులో ఆయన దిగివుండవచ్చని, లేకుంటే తన నియోజకవర్గమైన ఉస్మానాబాద్ కు వెళ్లి ఉండవచ్చని శివసేన ప్రతినిధులు తెలిపారు.
కాగా, ఎయిర్ ఇండియా మేనేజరును చెప్పుతో కొట్టి విమర్శల పాలైన గైక్వాడ్, క్షమాపణలు చెప్పేందుకు ససేమిరా అనడంతో, పలు ఎయిర్ లైన్ సంస్థలు ఆయన్ను విమానం ఎక్కనీయబోమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి ముంబైకి ప్రయాణించే అగస్ట్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ను ఆయన హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లో ఎక్కారు. ఆయన ఎక్కడ దిగారో మాత్రం తెలియరాలేదు.