: కైలాస మానస సరోవర యాత్ర చేసే వారికి రూ. లక్ష: వరమిచ్చిన యూపీ సీఎం యోగి


సాక్షాత్తూ పరమశివుడు నివాసం ఉంటాడని భావించే కైలాస పర్వతం, అక్కడికి సమీపంలో ఉండే మానస సరోవరం యాత్రకు వెళ్లేవారికి ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రాష్ట్రంలో మానస సరోవర్ భవన్ ను నిర్మించనున్నామని తెలిపారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ కు వచ్చిన ఆయన, ఓ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధిని తిరిగి మొదలు పెట్టనున్నట్టు తెలిపారు. కుల, మత రాజకీయాలకు స్థానం లేకుండా చేస్తానని, అన్ని వర్గాల అభివృద్ధికీ ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. సీఎం పదవి అధికారం కోసం కాదని అన్నారు.

  • Loading...

More Telugu News