: వచ్చే నెలలో నియోజకవర్గాల పునర్విభజన.. తెలంగాణలో అదనంగా 34 అసెంబ్లీ స్థానాలు!: సుజనా చౌదరి
ఏప్రిల్లో నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. తెలంగాణలో అదనంగా మరో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయని, ఫలితంగా మరికొందరికి రాజకీయ అవకాశాలు వస్తాయన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో కొందరు నాయకులు టీడీపీని వీడినా కేడర్ అండగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి సారించాలని నేతలకు సూచించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి రెండు, మూడు నెలలకు ఓసారి పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించుకుందామని అన్నారు. వీటికి హాజరుకావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరనున్నట్టు తెలిపారు.