: నాసా గణాంకాల్లో తప్పును కనుగొన్న విద్యార్థి!


అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నమోదు చేస్తున్న గణాంకాల్లో తప్పులు వస్తున్నాయని 17 ఏళ్ల లండన్ విద్యార్థి గుర్తించాడు. యూకేలోని షీఫీల్డ్‌ టాప్టన్‌ అనే పాఠశాలలో చదువుతున్న మైల్స్‌ సోలోమన్‌ అనే విద్యార్థి, ఐఎస్‌ఎస్‌ డేటాను విశ్లేషించే ప్రాజెక్టులో పనిచేసే అవకాశం కోసం జరిగిన పోటీలో పాల్గొని, రేడియేషన్‌ సెన్సార్లు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాయని గుర్తించాడు. ఈ మేరకు తాను కనుగొన్న విషయాన్ని నాసాకు ఈ-మెయిల్‌ ద్వారా తెలిపాడు.

రేడియేషన్ డిటెక్టర్‌ కు ఎలాంటి కిరణాలు తాకనప్పుడు కూడా నెగెటివ్‌ రీడింగ్‌ వస్తున్నట్టు గుర్తించాడు. ఒక రోజులో చాలాసార్లు ఇలా జరుగుతోందని గుర్తించి, దీన్ని సరిచేసేందుకు కావాల్సిన సమాచారాన్ని నాసాకు అందించాడు. తాము సంవత్సరంలో ఒకటి రెండు సార్లు ఇలా జరుగుతుందని అనుకుంటున్నామని, కానీ నిత్యమూ ఇదే జరుగుతోందని గుర్తించిన విద్యార్థి కృషిని అభినందిస్తున్నామని నాసా పేర్కొంది. ఇప్పుడు మైల్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

  • Loading...

More Telugu News