: ట్రంప్ పై తిరుగుబాటు... సొంత పార్టీ సభ్యుల వ్యతిరేకతతో 'హెల్త్ కేర్' బిల్లు వెనక్కు


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సొంత పార్టీ సభ్యుల నుంచే వ్యతిరేకత ఎదురైంది. 'ఒబామా కేర్' స్థానంలో తాను తెచ్చిన 'హెల్త్ కేర్' బిల్లుకు మద్దతు కూడగట్టడంలో విఫలమైన ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో బిల్లును వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. తాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ బిల్లును తెస్తే, మద్దతిచ్చేందుకు సొంత పార్టీ సభ్యులే ముందుకు రాకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకున్నారు. గురువారం నాడు సభలో బిల్లును పెట్టగా, మద్దతిచ్చేందుకు సరిపడా సభ్యులు లేకపోవడంతో దీన్ని వాయిదా వేశారు. దీని ఆమోదానికి కావాల్సినన్ని ఓట్ల కోసం స్పీకర్ పాల్ ర్యాన్ ప్రయత్నించినా, సఫలం కాలేకపోయారు. బిల్లు ఆమోదం పొందాలంటే 215 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, అంతమంది మద్దతిచ్చే సభ్యులు లేకపోవడంతో, తమకు పరాభవం తప్పదని భావించిన స్పీకర్, దీన్ని ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించారు. 235 మంది రిపబ్లికన్లు ఉన్న అమెరికా చట్టసభలో 80 మందికి పైగా సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News