: వచ్చే నెల 1 వరకు బ్యాంకులు ప్ర‌తిరోజు ప‌నిచేయాల్సిందే: ఆర్‌బీఐ


వ‌చ్చేనెల 1 వ‌ర‌కు బ్యాంకులన్నీ సెలవులు తీసుకోకుండా పనిచేయాలని రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు నుంచే ఈ ఆదేశాలు పాటించాలని తెలిపింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రయివేటు బ్యాంకులు ఈ ఎనిమిది రోజులూ తెరిచే ఉండ‌నున్నాయి. అంతేగాక ప‌లు ఆర్‌బీఐ కార్యాలయాలు కూడా ఈ ఎనిమిది రోజుల్లో ఒక్క‌రోజు కూడా సెల‌వు తీసుకోవ‌డానికి వీల్లేదు. పన్నుల వసూళ్లు, ప్రభుత్వ రసీదులు, చెల్లింపు విధులను సులభతరం చేసేందుకుగాను ఈ ఆదేశాలు జారీ చేస్తున్న‌ట్లు ఆర్‌బీఐ తెలిపింది. దీంతో ఆదివారం కూడా బ్యాంకులు పని చేయనున్నాయి. 

  • Loading...

More Telugu News