: అమరావతిలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో తెలంగాణ ఉద్యోగుల భేటీ
ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతిలో నిర్మించిన నూతన సచివాలయంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో తెలంగాణ ఉద్యోగులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆస్తుల విభజన కమిటీ సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. తమను తెలంగాణకు కేటాయించాలని కోరుతూ తెలంగాణకు చెందిన క్లాస్ -3, క్లాస్-4 ఉద్యోగులు మంత్రికి వినతిపత్రం అందించారు.