: తొలిటెస్టులోనే అద్భుత ప్రతిభ కనబరుస్తోన్న కుల్‌దీప్ పై సచిన్‌ ప్రశంసల జల్లు


ధ‌ర్మ‌శాల వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న చివ‌రిటెస్టు మ్యాచులో యువ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్ అదర‌గొడుతున్న విష‌యం తెలిసిందే. ఆడుతున్న తొలి టెస్టులోనే కుల్‌దీప్‌ అద్భుతంగా రాణించ‌డంతో ఆయ‌న ఆట‌తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ స‌చిన్ టెండూల్క‌ర్ స్పందించాడు. ఆయ‌న‌ ఆరంభం అదిరిపోయిందని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నాడు. బౌలింగ్‌లో కుల్‌దీప్‌ చూపిస్తున్న వైవిధ్యం త‌న‌ను ఆకట్టుకుందని, ఈ మ్యాచ్ కుల్‌దీప్‌ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నాడు. ఈ టెస్టు మ్యాచులో ఇప్పటికే కుల్‌దీప్‌ మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియాకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న విష‌యం తెలిసిందే.


  • Loading...

More Telugu News