: కాషాయమయంగా మారిన గోరఖ్ పూర్.. యోగి నామస్మరణలో నగరం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు తన నియోజకవర్గం గోరఖ్ పూర్ కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో, నగరం మొత్తం కాషాయమయమైంది. గోరఖ్ పూర్ మొత్తం యోగి కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లతో నిండిపోయింది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గోరఖ్ పూర్ కు వస్తున్న నేపథ్యంలో, అయన అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆయన నివాస స్థలమైన గోరఖ్ నాథ్ ఆలయ ప్రాంతానికి ఈ ఉదయం నుంచే వేలాదిగా మద్దతుదారులు తరలివస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ, ఆయన చేసిన మంచి పనులే ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు. 2024లో భారత ప్రధానిగా యోగిని చూడాలన్నదే తమ ఆశ అని తెలిపారు. ప్రస్తుతానికి యోగి వయసు చిన్నదని... 2024కు ప్రధాని పదవికి ఆయన సరితూగుతారని చెప్పారు.