: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న మంటలు
ఢిల్లీలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నరేలా పారిశ్రామిక ప్రాంతంలోని ప్లాస్టిక్ వస్తువుల తయారీ ఫ్యాక్టరీ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. దీంతో కార్మికులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 32 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఇంకా ఎగసి పడుతూనే ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నష్టానికి సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది.