: ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు
ఎయిర్ ఇండియా ఉద్యోగితో దురుసుగా ప్రవర్తించి, దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై ఈ రోజు సాయంత్రం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు తాము ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగిపై దాడిచేసిన అనంతరం తాను ఆ వ్యక్తిని చెప్పుతో కొట్టానని ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కూడా చెప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన విమానాల్లో తిరగకుండా ఎయిర్ ఇండియాతో పాటు పలు విమానయాన సంస్థలు ఆయన పేరును బ్లాక్ లిస్టులో పెట్టాయి. ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడంతో ఆయన మరిన్ని చిక్కుల్లో పడ్డారు.