: 14 ఏళ్లకే తండ్రి అయిన బాలుడు... యువతిపై కేసు నమోదు!
14 ఏళ్లకే ఓ బాలుడు తండ్రి అయిన ఘటన కేరళలోని కోచిలో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదివే ఓ బాలుడు తనకంటే నాలుగేళ్లు పెద్దదయిన ఓ యువతిని ప్రేమించాడు. వారి ప్రేమకు చిహ్నంగా వారికి ఓ పాప పుట్టింది. ప్రస్తుతం ఆ పాపకు రెండు నెలలు. అయితే, ఆ బాలుడు తనపై అత్యాచారం చేశాడని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ అంశం వార్తల్లోకెక్కింది. డీఎన్ఏ పరీక్ష జరిపించిన పోలీసులు ఆ బాలుడే ఆ పాపకు తండ్రని తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రశ్నించిన పోలీసులకు ఆ బాలుడు తాను వద్దంటున్నా ఆ యువతే తనతో సంబంధం పెట్టుకుందని చెప్పాడు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద ఆ యువతిపైనే కేసులు పెట్టి, న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో ముందుకు వెళతామని చెప్పారు.