: షారూఖ్ ఖాన్, జూహీ చావ్లాకు ఈడీ నోటీసులు


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, నటి జూహీ చావ్లాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. వీరిద్దరితోపాటు ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం మొత్తానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ నిధులు, ఇతర ఆర్ధిక సంబంధ విషయాలపై సరైన వివరాలు అందించలేదని, ఇంకా పూర్తి స్థాయిలో అందించాల్సి ఉందని చెబుతూ ఈడీ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యానికి నోటీసులు పంపింది. కాగా, ఐపీఎల్ లోని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు షారూఖ్ ఖాన్ తోపాటు జూహీ చావ్లా యజమానులుగా ఉన్నారు. వారికి సహ యజమానులుగా ఆ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్, పలువురు పారిశ్రామిక వేత్తలు ఉన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News