: బెంగళూరులో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నా.. జైల్లో నిద్రపోయాడు: జగన్ పై యనమల విసుర్లు


బెంగళూరులో అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ ను కట్టుకున్నప్పటికీ... జైల్లో నిద్రపోయారంటూ వైసీపీ అధినేత జగన్ ను యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. జైల్లో గడిపినన్ని రోజులు కూడా ఆ ప్యాలెస్ లో జగన్ నివసించలేకపోయారని అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా సంపాదించారని విమర్శించారు. జగన్ కు జీవితంలో ప్రశాంతత లేకుండా పోయిందని అన్నారు. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత జగన్ బాగా దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నారని... దాచుకున్న నోట్లన్నీ ఎందుకూ పనికి రాకుండా పోయాయన్న బాధ ఆయనలో కనిపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఓ సైకోలా మారారని అన్నారు. 

  • Loading...

More Telugu News