: ఉత్తరప్రదేశ్ మంత్రి కారుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముకుత్‌ కేసర్‌గంజ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెలిచిన ముకుత్‌ బిహారీ వర్మ ఇటీవ‌లే ఆ రాష్ట్ర మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ రోజు ఆయ‌న కారుపై ప‌లువురు ఆందోళ‌న‌కారులు రాళ్లు రువ్వ‌డం అల‌జ‌డి రేపింది. ఆయ‌న‌ కారును బారైచ్‌ ప్రాంతంలో అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే డ్రైవ‌ర్ కారును అప‌కుండా దూసుకువెళ్ల‌డంతో కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన బీజేపీ యూపీ నాయ‌కులు ఈ దాడి జ‌రిగిన స‌మ‌యంలో కారులో ముకుత్ లేర‌ని అంటున్నారు.

  • Loading...

More Telugu News