: కుమార్తె పుట్టిన రోజు వేడుకను దగ్గరుండి జరిపిన పవన్ కల్యాణ్.. పక్కన రేణు దేశాయ్ కూడా!


ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉండే పవన్ కల్యాణ్ తన పిల్లలకు కేటాయించే సమయం విషయంలో మాత్రం చాలా కచ్చితంగా ఉంటారు. అందుకే, ఈ రోజు తన సినిమా 'కాటమరాయుడు' రిలీజ్ అవుతున్నా... తన కుమార్తె ఆద్య పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఆమెతో గడిపి వచ్చారు. తన మాజీ భార్య రేణు దేశాయ్ తో కలసి కూతురి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

ఆద్య స్కూల్లో ఈ బర్త్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలసి పవన్ ఫొటోలు దిగారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పిల్లల పుట్టన రోజున కాస్త సమయాన్ని కేటాయించడమే... పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే నిజమైన బహుమతి అని ట్వీట్ చేసింది. రేణు దేశాయ్ వద్దే వీరి పిల్లలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తన పిల్లలను చూసేందుకు పవన్ కల్యాణ్ రెగ్యులర్ గా వారి వద్దకు వెళుతుంటారు.

  • Loading...

More Telugu News