: ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని ఆందోళన తెలుపుతున్న భారతీయ జనతా పార్టీ నేతలు ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు ఎక్కడికక్కడే ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా వారిని హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బీజేపీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్‌లు అక్కడికి చేరుకోగా వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది. టీఆర్ఎస్ సర్కారు ఏకపక్షంగా ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.