: చైనా డిమాండ్ ను అంగీకరించిన మైక్రోసాఫ్ట్!
మైక్రోసాఫ్ట్ సంస్థ చైనా కోసం మరిన్ని ఫీచర్లతో విండోస్ 10కి సీక్రెట్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఆ దేశ ప్రభుత్వ డిమాండ్ మేరకు చైనీయుల కోసమే ఆ వెర్షన్‌ను తీసుకొస్తున్నామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఆ సంస్థ 2015 జూలై 29న ప్రపంచ మార్కెట్‌లోకి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు విండోస్ 10ను మొత్తం 50 కోట్లకు పైగా కంప్యూటర్లలో ఉపయోగిస్తున్నారు. అయితే, తమ దేశ నిబంధనల ప్రకారం అందులో భద్రతా లోపాలు ఉన్నాయని చైనా స్పష్టం చేసింది. ఆ ఆపరేటింగ్ సిస్టంను తిరస్కరిస్తూ తాము చెబుతున్న మార్పులతో కొత్త సీక్రెట్ వెర్షన్‌ను రూపొందించాలని చెప్పింది. చైనా మార్కెట్‌లో విపరీతంగా ఉన్న తమ మార్కెట్ డిమాండ్‌ను దూరం చేసుకోకుండా మైక్రోసాఫ్ట్ చైనా డిమాండ్‌కు ఒప్పుకొని అందులో మార్పులు చేయనుంది.