: 'అవంతిక' పాత్రలో శ్రుతిహాసన్... పేరు వినిపించినప్పుడల్లా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈలలు!
అవంతిక... ఈ పేరు వినగానే గుర్తొచ్చేది బాహుబలి చిత్రం. బాహుబలి తొలి భాగంలో అవంతిక పాత్రలో తమన్నా నటించిన సంగతి తెలిసిందే. ఇక నేడు విడుదలైన పవన్ తాజా చిత్రం 'కాటమరాయుడు'లో హీరోయిన్ పాత్ర పేరు అవంతిక. ఈ క్యారెక్టర్ ను శ్రుతిహాసన్ పోషించింది. చిత్రంలో 'అవంతిక' అని పేరు వినిపించినప్పుడల్లా, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈలలు, గోలలతో సినిమా హాళ్ల టాప్ లేపుతున్నారు. ఈ చిత్రంపై రివ్యూలు సైతం పాజిటివ్ గా వస్తున్నాయి. బాహుబలిలో హిట్టయిన పాత్ర పేరును మరో టాప్ హీరో చిత్రంలో హీరోయిన్ కు పెట్టడం విశేషమే!