: ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమానంలో హంగామా సృష్టించిన దృశ్యాలు!


ఎయిర్ ఇండియా సిబ్బందిపై అమానుషంగా ప్రవర్తించిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై విమర్శలు తలెత్తున్నాయి. అనుచితంగా ప్రవర్తించిన రవీంద్ర గైక్వాడ్ పై నిషేధం విధిస్తూ ఎయిర్ ఇండియా ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, బిజినెస్ క్లాసు టికెట్ తీసుకున్న తనకు ఎకానమీ క్లాసులో సీటు చూపించారని మండిపడ్డ గైక్వాడ్, ఎయిర్ ఇండియా సిబ్బందిని చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. విమానంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను గుర్తుతెలియని వ్యక్తి తన ఫోన్ లో చిత్రీకరించారు. ఆ దృశ్యాలు బయటకు రావడంతో సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారాయి.

  • Loading...

More Telugu News