: సిద్ధూకు తొలగిన అడ్డంకి.. టీవీ షోలు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్!
రాష్ట్ర మంత్రిగా ఉంటూనే టీవీ షోలు చేసుకునేందుకు మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకు అనుమతి లభించింది. పంజాబ్ అడ్వొకేట్ జనరల్ అతుల్ నందా నుంచి సిద్ధూకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మంత్రిగా కొనసాగుతున్న సిద్ధూ టీవీ షోలు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అతుల్ నందా తెలిపారు. అతుల్ నుంచి తనకు నివేదిక అందిందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. అడ్వొకేట్ జనరల్ క్లారిటీ ఇవ్వడంతో, సిద్ధూకు అడ్డంకులు తొలగిపోయాయి. డబ్బు సంపాదన కోసం టీవీ షోలలో పాల్గొనడం మినహా తనకు మరో దారి లేదని సిద్ధూ అంతకుముందు చెప్పిన సంగతి తెలిసిందే. టీవీ షోలలో పాల్గొనడం అవినితికి పాల్పడటం కాదని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో, అడ్వొకేట్ జనరల్ సలహాను ముఖ్యమంత్రి కోరారు.