: "మనవాళ్లు బ్రీఫ్డ్ మీ"... అన్న గొంతు నాది కాదని ఒక్క మాట చెప్పండి... గౌరవం కాపాడతాం!: చంద్రబాబును కోరిన వైకాపా


ఓటుకు నోటు కేసులో భాగంగా విడుదలైన ఆడియో టేపుల్లో ఉన్న "మనవాళ్లు బ్రీఫ్డ్ మీ" అని వినిపించిన గొంతు తనది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్క మాట చెబితే, ఆయన్ను తాము గౌరవిస్తామని వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశంపై సభలో చర్చించాలన్నది తమ ఉద్దేశమని, తెలుగుదేశం మాత్రం సభను, ప్రజలను తప్పుదారి పట్టించేందుకే వ్యక్తిగత దూషణలకు దిగుతోందని ఆయన విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలపై చర్చించేందుకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఆడియో టేపులను అసెంబ్లీలో ప్రసారం చేయాలని, ఆపై అందులో వినిపించిన వాయిస్ తనది కాదని చంద్రబాబు చెబితే, ఆయన గౌరవాన్ని కాపాడేందుకు తాము పోరాటం చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News