: అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులపై వేటు! ‘ఎయిర్ ఇండియా’ నిషేధిత జాబితాలో ఎంపీ గైక్వాడ్!


ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై విమర్శలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులను అడ్డుకునేందుకు ఎయిర్ ఇండియా ఓ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తొలిసారిగా నిషేధిత జాబితా ప్రవేశపెట్టింది. ఆ జాబితాలో ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పేరును చేర్చామని, నిషేధం ఎంతకాలం కొనసాగుతుందనే విషయమై ఇంకా స్పష్టత లేదని ఎయిర్ ఇండియాకు చెందిన ఓ అధికారి తెలిపారు. కాగా, రవీంద్ర గైక్వాడ్ పై భారత ఎయిర్ లైన్స్ ఫెడరేషన్ (ఎఫ్ఐఏ) కూడా నిషేధం విధించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News