: ఆవేశపూరిత ప్రసంగాల హుకుందేవ్ ను ఉప రాష్ట్రపతిని చేయాలని మోదీ నిర్ణయం!
బీహార్ లోని మధుబని నియోజకవర్గం నుంచి ఐదుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన ఓబీసీ నేత, తన ఆవేశపూరిత ప్రసంగాలతో పార్లమెంటును కుదిపేసే హుకుందేవ్ నారాయణ్ యాదవ్ ను తదుపరి ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ వర్గాల కథనం ప్రకారం, హమీద్ అన్సారీ స్థానంలో హుకుందేవ్ నియామకానికి మోదీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని 'దైనిక్ భాస్కర్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. యాదవ కులస్తుడైన హుకుందేవ్ ను పోటీకి దింపితే, బీహార్ లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్) మద్దతు కూడా తమకు లభిస్తుందని, సులువుగానే ఆయన్ను గెలిపించుకోవచ్చని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సంవత్సరం జూలైతో హమీద్ అన్సారీ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే.