: జగన్ పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే గొల్లపల్లి
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి ఎంతో కాలం రాజకీయాల్లో కొనసాగానని, ఆయన సతీమణి విజయమ్మను తాము ఎప్పుడూ చూడలేదని, అయితే.. జగన్ తన స్వప్రయోజనాల కోసం తన తల్లిని, చెల్లిని బజారులో నిలబెట్టారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పక్కదోవ పట్టించిన ఘనత జగన్ దేనని ఆయన ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు వల్లే న్యాయం జరుగుతుందని అన్నారు. భోజనానికి రమ్మనమని రాజధాని రైతులు ఆప్యాయంగా పిలిస్తే తిరస్కరించిన వ్యక్తిని ఏమనాలని ప్రశ్నించిన ఆయన, జగన్ లో మానవత్వం ఉందా? అంటూ మండిపడ్డారు.